Crime News: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత కఠినమైన చట్టాలు, శిక్షలు ఉన్నా కూడా ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరగడం దారుణం.. ముక్కుపచ్చలారని పిల్లలను కూడా కామాందులు వదిలి పెట్టకుండా చెర పట్టడం కన్నీరు తెప్పిస్తుంది. చిన్న పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎటూ పంపించాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. స్కూల్‌ కు వెళ్లిన అమ్మాయిలు, కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇల్లు చేరే వరకు కూడా రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన చెప్పే సంఘటన మరోసారి ఏపీ లో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకాశం జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... కనిగిరి మండలం ఎన్‌ గొల్లపల్లి శివారు ప్రాంతంలో 13 ఏళ్ల బాలిక మృతదేహం ఉంది. ఆ మృతదేహం మొహం గుర్తు పట్టలేనంత దారుణంగా మొహం చిద్రం అయింది. ముఖంపై రాయితో విచక్షన రహితంగా మోదినట్లుగా ఉంది. ఆ బాలిక ఎవరు అనే విషయం ను గుర్తించడానికి పోలీసులకు కష్టంగా మారింది. అయితే చుట్టు పక్కల పడి ఉన్న అమ్మాయి స్కూల్‌ పుస్తకాల ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 13 ఏళ్ల బాలిక మృతి పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యం లో స్కూల్‌ కు పంపించాలంటే తమ పిల్లల విషయంలో కూడా భయపడాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: TS Assembly Elections: రూ.4 వేల పెన్షన్ ఇస్తాం.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి ప్రకటన  


బాలిక మృతదేహంకు పోస్ట్‌ మార్టం నిర్వహిస్తున్నారు. సంఘటన జరిగిన తీరును బట్టి అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసి ఆ తర్వాత బయటకు విషయం తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో బాలికను రాయితో మొహం పై కొట్టి గుర్తు పట్టకుండా చేశారు. అంతకు ముందే బాలికను చంపేసి ఉంటారు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన కు సంబంధించిన విషయాలు ఒకొక్కటి చొప్పున పోలీసులు బయటకు వెళ్లడిస్తూ ఉంటే బాబోయ్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా ఈ సంఘటన జరిగిందని పోలీసుల ప్రాధమిక విచారణ లో వెళ్లడి అయింది. బాలిక స్కూల్‌ కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టినట్లుగా పేర్కొన్నారు.


Also Read: Asia Cup 2023: చాహల్‌ను పక్కనపెట్టిన బీసీసీఐ.. భార్య ధన్యశ్రీ సీరియస్ పోస్ట్..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి